![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -928 లో......మినిస్టర్ భార్య డెలివరీకి హాస్పిటల్ లో అడ్మిట్ అవుతుంది. మినిస్టర్ టెన్షన్ పడుతుంటే డాక్టర్ ధైర్యం చెప్తుంది. ఆ తర్వాత డాక్టర్ కావ్య దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్లేసరికి కావ్య తన గది లోపల ఉండదు. అదే విషయం బయటకు వచ్చి అపర్ణ వాళ్ళకి చెప్తుంది. వాళ్ళు షాక్ అవుతారు. వదిన అన్నయ్య దగ్గరికి వెళ్లి ఉంటుంది. నేను వెళ్లి తీసుకొని వస్తానని కళ్యాణ్ వెళ్తాడు.
మరొకవైపు స్టేషన్ లో ఉన్న రాజ్ దగ్గరికి కావ్య వస్తుంది. తనని చూసి నువ్వు ఎందుకు వచ్చావని అడుగుతాడు. నాకు డెలివరీ అయ్యే టైమ్ లో నా పక్కనే ఉంటానని మాటిచ్చారు. నా పక్కన ఉండాలిసిందేనని కావ్య అంటుంది. కావ్య వెళ్లి ఇన్‌స్పెక్టర్ ని రిక్వెస్ట్ చేస్తుంది. వాళ్ళు ఒప్పుకోరు. అప్పుడే కళ్యాణ్ వచ్చి కావ్యని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు. డాక్టర్ కావ్యకి ట్రీట్ మెంట్ ఇస్తుంది.
డాక్టర్ బయటకు వచ్చి అపర్ణ వాళ్ళపై కోప్పడుతుంది. మేము కావ్య పరిస్థితి ఏంటో చెప్తున్నాం అయిన మీరు తనకి నచ్చచెప్పడం లేదని అంటుంది. ఆ తర్వాత రాజ్ కానిస్టేబుల్ ని రిక్వెస్ట్ చేసి ఫోన్ తీసుకుంటాడు. కళ్యాణ్ కి ఫోన్ చేసి.. నేను న్యాయంగానే స్టేషన్ నుండి బయటకు వద్దామనుకున్న కానీ కావ్య పరిస్థితి చూసి రాక తప్పడం లేదు. నువ్వు స్టేషన్ కి ఫోన్ చేసి నేను చెప్పమన్నట్లు చెప్పు అని రాజ్ అంటాడు. తరువాయి భాగంలో రాజ్ స్టేషన్ నుండి తప్పించుకొని హాస్పిటల్ కి వెళ్తాడు. రాజ్ వెళ్లకుండా అప్పు ఆపుతుంది. నేను రూల్స్ బ్రేక్ చెయ్యనని అప్పు అనగానే.. నువ్వు మమ్మల్ని దాటుకొని వాడిని ఎలా వెళ్లానివ్వవో చూస్తానని అపర్ణ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |